రెండు వ్యభిచార గృహాలపై దాడులు.. పలువురి అరెస్ట్‌
eenadu telugu news
Updated : 27/10/2021 19:16 IST

రెండు వ్యభిచార గృహాలపై దాడులు.. పలువురి అరెస్ట్‌

పంజాగుట్ట: రెండు వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించి మహిళలు, విటులు, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పంజాగుట్ట అడ్మిన్‌ ఎస్సై కౌశిక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రమంజిల్‌ హిల్‌టాప్‌ కాలనీ ప్లాట్‌ నంబర్‌ 101లో రాజేష్‌ నాయక్‌ అనే వ్యక్తి వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో సీసీఎస్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాజేష్‌ నాయక్‌ ఇచ్చిన సమాచారంతో శ్రీనగర్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దాడులు చేసి అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్న రాము, ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో మొత్తం రూ.22వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని