గడువులోగా పనులు పూర్తిచేయకుంటే చర్యలు
eenadu telugu news
Published : 28/10/2021 00:37 IST

గడువులోగా పనులు పూర్తిచేయకుంటే చర్యలు

అగ్గనూర్‌లో పరిశీలిస్తున్న అదనపు పాలనాధికారి చంద్రయ్య

యాలాల: మండలంలో నిర్మిస్తున్న వైకుంఠధామాలను సత్వరమే పూర్తి చేయాలని అదనపు పాలనాధికారి చంద్రయ్య సిబ్బందికి సూచించారు. బుధవారం మండలంలోని జక్కేపల్లి, ముకుందాపూర్‌, అగ్గనూర్‌, జుంటిపల్లిలో నిర్మిస్తున్న శ్మశాన వాటికలను ఎంపీడీవో పుష్పలీలతో కలిసి పరిశీలించారు. జక్కేపల్లి, ముకుందాపూర్‌, అగ్గనూర్‌లో త్వరగా పూర్తి చేయాలని సర్పంచులకు సూచించారు. అగ్గనూర్‌లోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీచేసి వివరాలను తెలుసుకున్నారు. జుంటిపల్లిలో సర్వే చేసి వివరాలు పంపించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గడువులోగా పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీవో మహేష్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ ఏఈ మధు, సర్పంచులు భీమప్ప, వెంకట్‌రెడ్డి, నారాయణమ్మ, శాంతిబాయి, కార్యదర్శులు శ్రీనివాస్‌ గౌడ్‌, వెంకటప్ప పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని