శాస్త్రీపురంలో గ్రేడ్‌ సపరేటర్‌ నిర్మాణ పనులు
eenadu telugu news
Published : 28/10/2021 00:56 IST

శాస్త్రీపురంలో గ్రేడ్‌ సపరేటర్‌ నిర్మాణ పనులు

ఆరు నెలలపాటు ట్రాఫిక్‌ మళ్లింపు

రాయదుర్గం, న్యూస్‌టుడే: రాజేంద్రనగర్‌ శాస్త్రీపురంలో.. సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా-శివరాంపల్లి రైల్వే లైన్‌ చెంత గ్రేడ్‌ సపరేటర్‌ (ఆర్‌ఓబీ/ఆర్‌యూబీ) పనులు చేపడుతున్న కారణంగా ఆ మార్గంలో 6 నెలలపాటు ట్రాఫిక్‌ మళ్లించనున్నట్లు సైబరాబాద్‌ డీసీపీ(ట్రాఫిక్‌) ఎస్‌ఎం విజయ్‌ కుమార్‌ తెలిపారు. నవంబరు 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30 వరకు అమలులో ఉంటుందని వివరించారు. వట్టేపల్లి నుంచి మహ్మూదా హోటల్‌, మెహ్‌ఫిల్‌ హోటల్‌, మైలార్‌ దేవ్‌పల్లి జంక్షన్‌ మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయి.

ఈ క్రమంలో ప్రత్యామ్నాయ దారులిలా..

* ప్రత్యామ్నా దారి 1:. మైలార్‌దేవ్‌పల్లి-ఆరాంఘర్‌ రోడ్డు-శాస్త్రిపురం ప్రధాన రహదారి-వట్టేపల్లి రోడ్డు.
* ప్రత్యామ్నా దారి 2:. వట్టేపల్లి రోడ్డు-శాస్త్రిపురం రోడ్డు ఫలక్‌నుమా రోడ్డు-శివరాంపల్లి రైల్వే రోడ్డు-మైలార్‌దేవ్‌పల్లి.
* ప్రత్యామ్నాయ దారి 3: వట్టేపల్లి రోడ్డు-ఇంజిన్‌బౌలి చౌరస్తా రోడ్డు-ఫలక్‌నుమా రోడ్డు-చాంద్రాయణగుట్ట-మైలార్‌దేవ్‌పల్లి
* ప్రత్యామ్నా దారి 4: మైలార్‌దేవ్‌పల్లి-ఆరాంఘర్‌ చౌరస్తా రోడ్డు-శాస్త్రీపురం ప్రధాన రహదారి-తాడ్బన్‌ జంక్షన్‌- కాలాపత్థర్‌ రోడ్డు-శంషీర్‌గంజ్‌ రోడ్డు-ఇంజిన్‌ బౌలి చౌరస్తా రోడ్డు- వట్టేపల్లి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని