పదేళ్లుగా గాయబ్‌.. బెంగళూరులో పట్టివేత
eenadu telugu news
Published : 28/10/2021 00:56 IST

పదేళ్లుగా గాయబ్‌.. బెంగళూరులో పట్టివేత

ఈనాడు, హైదరాబాద్‌: పదేళ్లుగా ముప్పుతిప్పలు పెడుతున్న నిందితుడిని సైబరాబాద్‌ పోలీసులు ఎట్టకేలకు బెంగళూరులో అదుపులోకి తీసుకొని నగరానికి తెచ్చినట్లు సమాచారం. ఫిర్యాదీదారుడు గోలీలు, టానిక్‌లు తయారు చేసి ప్రముఖ ఫార్మా కంపెనీలకు సరఫరా చేస్తుంటారు. బాలానగర్‌, బొల్లారం, హిమాచల్‌ప్రదేశ్‌లలో ప్లాంట్లున్నాయి. దాదాపు వెయ్యి మంది వరకు పనిచేస్తుంటారు. ముడి పదార్థాల కొనుగోలు బాధ్యతను స్నేహితుడైన దీపక్‌కు అప్పగించారు. దీపక్‌ తన భార్య శిల్పాతో కలిసి మోసాలకు తెరదీశాడు. ముడి పదార్థాలను కొనకుండానే నకిలీ బిల్లులు సృష్టించి రూ.20 కోట్ల వరకు కాజేశాడు. ఫిర్యాదీదారుడు 2010లో బాలానగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి.. దంపతులను రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై బయటికొచ్చి వాయిదాలకు హాజరుకానందుకు అరెస్ట్‌ చేయాలని కోర్టు వారెంట్‌ జారీ చేసింది. బాలానగర్‌ సీఐ వహీదుద్దీన్‌ నిందితులను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని