సంక్షిప్త వార్తలు
eenadu telugu news
Published : 28/10/2021 02:44 IST

సంక్షిప్త వార్తలు

గ్రేటర్‌లో మరో 32 బస్తీ దవాఖానాలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: పేదలకు మెరుగైన వైద్యం చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నగరంలో బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తెచ్చింది. గ్రేటర్‌ వ్యాప్తంగా 226 దవాఖానాలు ఇప్పటికే ఉచిత వైద్య సేవలు, మందులు, వైద్య పరీక్షలను అందిస్తున్నాయి. కొత్తగా మరో 32 బస్తీ ఆసుపత్రులను అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్యశాఖ కసరత్తు చేస్తున్నాయి. మొత్తం కలిపి 300 ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. ఏర్పాటు ప్రక్రియ జీహెచ్‌ఎంసీ చూస్తుండగా.. నిర్వహణ వైద్యారోగ్యశాఖ చూస్తోంది.


బల్దియాలో జోనల్‌ కమిషనర్ల బదిలీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీలో పలువురు జోనల్‌, అదనపు కమిషనర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర పురపాలకశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌గా ఉన్న రవికిరణ్‌ ఖైరతాబాద్‌ ఇన్‌ఛార్జిగా కూడా కొనసాగుతున్నారు. ఆయన్ని బదిలీ చేసి ఖైరతాబాద్‌కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. అదనపు కమిషనర్‌ ఆల ప్రియాంకను శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌గా, ఎల్‌బీనగర్‌ జెడ్సీగా ఉన్న ఉపేందర్‌రెడ్డిని నల్గొండ పురపాలక కమిషనర్‌గా బదిలీ చేశారు. కూకట్‌పల్లి జెడ్సీ మమతను మొదట ఎల్బీనగర్‌ జెడ్సీగా బదిలీ చేశారు. అదనపు కమిషనర్‌ పంకజను కూకట్‌పల్లి జెడ్సీగా బదిలీ చేస్తూ పురపాలకశాఖ ఉత్తర్వులిచ్చింది. జెడ్సీ మమతను కూకట్‌పల్లి స్థానంలోనే కొనసాగిస్తూ, ఆమె బదిలీ స్థానంలో అదనపు కమిషనర్‌ పంకజకు ఎల్బీనగర్‌ జోనల్‌ బాధ్యతలు అప్పగిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ నిర్ణయం తీసుకోగా.. పురపాలకశాఖ ఆమోదించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని