Bandi Sanjay: వరి సాగుపై ప్రభుత్వ వైఖరిని నిరసనగా బండి సంజయ్‌ రైతు దీక్ష
eenadu telugu news
Updated : 28/10/2021 14:06 IST

Bandi Sanjay: వరి సాగుపై ప్రభుత్వ వైఖరిని నిరసనగా బండి సంజయ్‌ రైతు దీక్ష

హైదరాబాద్‌: వరి సాగుపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర భాజపా ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దీక్షకు దిగారు. తొలుత గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన సంజయ్‌.. అనంతరం కిసాన్‌ మోర్చా నేతలతో కలిసి దీక్షలో కూర్చొన్నారు. ‘వరి-ఉరి, ప్రభుత్వ వైఖరి’ పేరిట చేపట్టిన ఈ దీక్ష మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. తెరాస ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల్ని విడనాడాలన్న డిమాండ్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చేందుకు బండి సంజయ్‌ ఈ దీక్ష చేపట్టినట్లు భాజపా నేతలు చెప్పారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని