Ts News: తెరాస ప్లీనరీ ఫ్లెక్సీలు.. మంత్రి, మేయర్‌, ఎమ్మెల్యేకు జరిమానా
eenadu telugu news
Published : 29/10/2021 02:18 IST

Ts News: తెరాస ప్లీనరీ ఫ్లెక్సీలు.. మంత్రి, మేయర్‌, ఎమ్మెల్యేకు జరిమానా

హైదరాబాద్‌: తెరాస ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలపై విమర్శలు రావడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన  ఒక్కో ఫ్లెక్సీకి రూ.5వేల నుంచి రూ.25వేల వరకు జరిమానాలు విధించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి ఈవీడీఎం (డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) వెబ్‌సైట్‌ పనిచేయలేదని, వెబ్‌సైట్‌ను ఇవాళ పునరుద్ధరించినట్టు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ఫ్లెక్సీల ఏర్పాటుకు బాధ్యులుగా గుర్తించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్ విజయలక్ష్మి‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జరిమానాలు విధించినట్టు అధికారులు తెలిపారు. ఈనెల 25న హైదరాబాద్‌ హైటెక్స్‌లో తెరాస ప్లీనరీ సమావేశం అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని