close

ఆదివారం, ఫిబ్రవరి 23, 2020

తాజా వార్తలు

ట్రాక్టర్‌, ద్విచక్రవాహనం ఢీ.. వ్యక్తి దుర్మరణం
ప్రమాద స్థలంలో కురుమయ్య మృతదేహం

పాన్‌గల్‌, న్యూస్‌టుడే : ట్రాక్టర్‌, ద్విచక్రవాహనం ఢీకొన్న దుర్ఘటనలో వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన ఆదివారం పాన్‌గల్‌ శివారులో జరిగింది. ఎస్సై తిరుపాజీ కథనం ప్రకారం.. బండపల్లికి చెందిన కురుమయ్య (42) మాధవరావుపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో పాన్‌గల్‌ నుంచి దావుత్‌ఖాన్‌పల్లికి వెళ్తున్న ట్రాక్టర్‌, ద్విచక్రవాహనం కొదండంబావి దగ్గర ఢీకొన్నాయి. తీవ్రంగా గాయపడిన కురుమయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపాజీ తెలిపారు. సర్పంచి రాజేశ్వరమ్మ, పీసీసీ సభ్యుడు రామూర్తినాయుడు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.