close

ఆదివారం, ఫిబ్రవరి 23, 2020

తాజా వార్తలు

నాలుగో తరగతి రెవెన్యూ ఉద్యోగుల కార్యవర్గం
కార్యవర్గాన్ని సన్మానిస్తున్న సంఘం నేతలు

మహబూబ్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే : తెలంగాణ నాలుగో తరగతి రెవెన్యూ ఉద్యోగుల జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం సంఘ భవనంలో ఎన్నుకున్నారు. ముఖ్యఅతిథిగా, ఎన్నికల పరిశీలకుడిగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరేందర్‌ హాజరయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడిగా టి.యాదయ్య, కార్యదర్శిగా జి.విష్ణుకుమార్‌, ఉపాధ్యక్షులుగా చెన్నమ్మ, బి.నర్సింహులు, సంయుక్త కార్యదర్శులుగా ఇలియాస్‌, కె.యాదయ్య, కోశాధికారిగా సుల్తాన్‌లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు నరేందర్‌, తఖీబాబా, రహమాన్‌, బాలేందర్‌, కిషన్‌, ఫరీద్‌, రాజు, సిరాజ్‌, రామకృష్ణ, శివరాములు పాల్గొన్నారు.

నారాయణపేట తాలూకా కమిటీ..: నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నారాయణపేట తాలూకా కమిటీ అధ్యక్షుడిగా కె.ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా ఎం.శ్రీదేవి, సంయుక్త కార్యదర్శిగా రేణుక, కార్యాలయ కార్యదర్శిగా ఎల్లప్పను ఎన్నుకున్నారు. అలాగే జడ్చర్ల తాలూకా ప్రధాన కార్యదర్శిగా కె.విశ్వప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నరేందర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.