త్వరలో పీఠాధిపతిని నిర్ణయిస్తాం: వెల్లంపల్లి
logo
Updated : 18/06/2021 20:20 IST

త్వరలో పీఠాధిపతిని నిర్ణయిస్తాం: వెల్లంపల్లి

కడప: త్వరలో బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిని నిర్ణయిస్తామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠాన్ని శుక్రవారం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, స్థానిక ఎమ్మెల్యే సందర్శించారు.

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి విషయంలో గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులందరితో విడివిడిగా  చర్చలు జరిపారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... అందరూ ఏకాభిప్రాయానికి రావాలని కోరినట్టు చెప్పారు. 3 రోజుల్లో వారే స్వయంగా  కూర్చుని మాట్లాడుకుంటామని చెప్పారని తెలిపారు. ఎక్కడైనా ఒక కటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్థలు ఉండటం సాధారణమేనని వ్యాఖ్యానించారు. శివస్వామి ప్రకటించిన పీఠాధిపతి ఎంపిక చెల్లదని, వారిని దేవాదాయశాఖ పంపించిందనడం అవాస్తవమన్నారు. దేవాదాయశాఖకు పీఠాధిపతుల బృందానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. పీఠాధిపతి నిర్ణయం కొలిక్కి రాకపోతే దేవాదాయశాఖ, ధార్మిక పరిషత్‌ ఒక నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని