‘కొత్త కలెక్టర్‌ రాకతో ఉద్యోగులకు స్వాతంత్య్రం వచ్చింది’
eenadu telugu news
Published : 29/07/2021 01:31 IST

‘కొత్త కలెక్టర్‌ రాకతో ఉద్యోగులకు స్వాతంత్య్రం వచ్చింది’

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : జిల్లాకు కొత్త కలెక్టర్‌ రాకతో ఉద్యోగులకు స్వాతంత్య్రం వచ్చిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం గృహనిర్మాణశాఖ మంత్రి నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి చేపట్టిన పేదలందరికీ ఇళ్ల పథకానికి సంబంధించి జిల్లా అధికారులు సమీక్షలు చేసే సమయంలో క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు, సిబ్బంది పడే కష్టాలు, బాధలను కూడా పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. కేటాయించిన లక్ష్యాలను చేరుకోవడానికి క్షేత్రస్థాయి సిబ్బందిని ఇబ్బందిపెట్టేలా చూడటం సరికాదన్నారు. బదిలీపై వెళ్లిన అధికారిని పరోక్షంగా విమర్శించిన సమయంలో ఉద్యోగులకు స్వాతంత్య్రం వచ్చిందని ఎమ్మెల్యే రాచమల్లు అనగానే పక్కనే ఉన్న పలువురు ప్రజాప్రతినిధులు నవ్వడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని