నిరాశ్రయులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
eenadu telugu news
Published : 29/07/2021 01:31 IST

నిరాశ్రయులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : దేశంలో ఎలాంటి ఆశ్రయం లేక నిరాశ్రయులుగా మారిన వారిని ఈ దేశ పౌరులుగా గుర్తించి ఆదుకోవాలని ఇచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాలకులు చర్యలు తీసుకోవాలని రాష్ట్రస్థాయి స్వచ్ఛంద సంస్థల సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాజమహేంద్రవరంలోని స్వర్ణాంధ్ర సేవాసంస్థ సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్రస్థాయి స్వచ్ఛంద సంస్థల సమావేశం జరిగింది. సంస్థ నిర్వాహకుడు గుబ్బల రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ పాల్గొని ప్రసంగించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో సుమారు 250 పట్టణ నిరాశ్రయుల కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం 88 కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. ఐదేళ్లు పూర్తిచేసుకున్న 20 డే అండ్‌ నైట్‌ షెల్టర్లను మూసివేశారన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని