సమయపాలన తప్పనిసరి: కలెక్టర్‌
eenadu telugu news
Published : 29/07/2021 01:31 IST

సమయపాలన తప్పనిసరి: కలెక్టర్‌

బలిపీఠం వద్ద పూజలు చేస్తున్న కలెక్టరు విజయరామరాజు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించి, కేటాయించిన విధులను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ విజయరామరాజు ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలోని దృశ్యమాధ్యమ కేంద్రంలో వివిధ శాఖల అధికారులతో ఆయన పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా ఉద్యోగ ధర్మాన్ని పాటించాలని సూచించారు. అనంతరం స్పందన హాలులో నిర్వహించిన మరో సమావేశంలో కొవిడ్‌-19 నియంత్రణ చర్యలపై నోడల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీలు గౌతమి, సాయికాంత్‌వర్మ, ధ్యానచంద్ర, ధర్మచంద్రారెడ్డి, డీఆర్వో మాలోల, సబ్‌ కలెక్టర్లు పృథ్వీతేజ్‌, కేతన్‌గార్గ్‌, జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులు, డ్వామా పీడీ యదుభూషన్‌రెడ్డి, డీఎంహెచ్‌వో అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కోదండ రాముడి సేవలో...

ఒంటిమిట్ట : ఏకశిలానగరి కోదండ రాముడి కోవెలను జిల్లా నూతన కలెక్టరు వి.విజయరామరాజు సందర్శించారు. విజయవాడ నుంచి బుధవారం నేరుగా ఒంటిమిట్టకు చేరుకున్నారు. రామయ్య క్షేత్రానికి విచ్చేసిన పాలనాధికారికి తితిదే అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భాలయంలో సీతారామలక్ష్మణ మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం చారిత్ర, ప్రాచీన ప్రాశస్త్యం గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సంయుక్త కలెక్టరు సాయికాంత్‌వర్మ, రాజంపేట సబ్‌ కలెక్టరు కేతన్‌గార్గ్‌, శిక్షణ కలెక్టరు కార్తీక్‌, తహసీల్దార్లు విజయకుమారి, రమాకుమారి, ఎంపీడీవో మల్‌రెడ్డి ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని