సర్పంచులతోనే గ్రామాభివృద్ధి సాధ్యం
eenadu telugu news
Published : 29/07/2021 01:31 IST

సర్పంచులతోనే గ్రామాభివృద్ధి సాధ్యం

సర్పంచులతో అధికారులు, శిక్షకులు

కడప ఏడురోడ్లు, న్యూస్టుడే : గ్రామాభివృద్ధి సర్పంచులతోనే సాధ్యమవుతుందని డీపీవో ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సర్పంచుల రెండో విడత శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా బుధవారం కడప జడ్పీ ఆవరణలోని డీపీఆర్‌సీలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాగునీరు, వీధిదీపాలు, పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాలని సూచించారు. ప్రతిరోజూ గ్రామ పంచాయతీ కార్యాలయాలను సందర్శిస్తే ఉద్యోగులు అశ్రద్ధ విడి చురుగ్గా పనిచేస్తారన్నారు.

నేటి నుంచి మూడో విడత శిక్షణ : నూతనంగా ఎన్నికైన సర్పంచులకు మూడో విడత శిక్షణ తరగతులు ఈనెల 29, 30, 31వ తేదీల్లో కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, రాజంపేట, బద్వేలు కేంద్రాల్లో జరుగుతాయని జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి తెలిపారు. కమలాపురం, టి.సుండుపల్లె, వి.ఎన్‌.పల్లె మండలాల సర్పంచులకు కడప జడ్పీ డీపీఆర్‌సీ భవన్‌లో, సింహాద్రిపురం మండల సర్పంచులకు పులివెందులలో, పెద్దముడియం మండల సర్పంచులకు ప్రొద్దుటూరులో, ఒంటిమిట్ట, రైల్వేకోడూరు మండలాల సర్పంచులకు రాజంపేటలో, కాశినాయన, గోపవరం మండలాల సర్పంచులకు బద్వేలులో శిక్షణ ఉంటుందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని