బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల ధర్నా
eenadu telugu news
Updated : 29/07/2021 06:42 IST

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల ధర్నా

నినాదాలు చేస్తున్న ఉద్యోగులు

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే : ‘ప్రైవేటు నెట్‌వర్క్‌లు ఎప్పటి నుంచో 4జీ సర్వీసులు అందిస్తున్నాయి. త్వరలో 5జీ సర్వీసులు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటికీ 3జీ సర్వీసులకే పరిమితం కావడం బాధాకరం. ప్రైవేట్‌కు దీటుగా 4జీ, 5జీ సర్వీసులను త్వరగా తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి’ అని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఆకుల సుబ్బారావు, అఖిల భారత బీఎస్‌ఎన్‌ఎల్‌ డాట్‌ పింఛనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కళ్యా సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ కడప కార్యాలయం వద్ద వివిధ సంఘాల నాయకులు, ఉద్యోగులతో కలిసి బుధవారం ధర్నా నిర్వహించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏఐజీఈటీవోఏ జిల్లా కార్యదర్శి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వ సంస్థలను బలోపేతం చేసి, ఉద్యోగులకు ప్రతినెల సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎస్‌ఎన్‌ఈఏ జిల్లా కోశాధికారి నందసుకుమార్‌రెడ్డి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని