ఆర్టీపీపీలో మూడు యూనిట్లలోనే విద్యుదుత్పత్తి
eenadu telugu news
Published : 27/09/2021 06:17 IST

ఆర్టీపీపీలో మూడు యూనిట్లలోనే విద్యుదుత్పత్తి

రాయలసీమ తాప విద్యుదుత్పత్తి కేంద్రం

ఆర్టీపీపీ (ఎర్రగుంట్ల), న్యూస్‌టుడే: రాయలసీమ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ)లో మూడు యూనిట్లలో మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు ఆదివారం సీఈ మోహన్‌రావు తెలిపారు. మొత్తం ఆరు యూనిట్లలో ఆర్టీపీపీలో 1650 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ప్రస్తుతం 1, 3, 4 యూనిట్లలో సుమారు 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతున్నట్లు వివరించారు. మిగిలిన 2, 5, 6లలో రెండు యూనిట్లు నిర్వహించినట్లు తెలిపారు. ఆర్టీపీపీలో 80 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు అందుబాటులో ఉన్నట్లు సీఈ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని