జిల్లా పర్యాటక రంగ అభివృద్ధికి కృషి
eenadu telugu news
Published : 27/09/2021 06:17 IST

జిల్లా పర్యాటక రంగ అభివృద్ధికి కృషి

మాట్లాడుతున్న ఏపీ టూరిజం శాఖ సంచాలకులు జయన్న

కడప ఎన్‌జీవో కాలనీ, న్యూస్‌టుడే : జిల్లా పర్యాటక రంగ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నూతనంగా నియమితులైన ఏపీ టూరిజం శాఖ డైరెక్టర్లు అల్లాబకష్‌, జయన్న పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, టూరిజం అథారిటీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కడప హరిత హోటల్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. అందమైన అడవులు, ప్రకృతి సౌందర్యం, ఖనిజాలు, అటవీ సంపదకు జిల్లా ప్రసిద్ధిచెందిందన్నారు. ఎంతోమంది కవులు, సాహితీవేత్తలు జన్మించారని, అలాంటి కడప జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడం తమ ముందున్న కర్తవ్యమన్నారు. జిల్లా పర్యాటక రంగ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఇంటాక్‌, జిల్లా పర్యాటక రంగ అభివృద్ధి సంస్థ, రాయలసీమ టూరిజం, కల్చరల్‌ సొసైటీలతో కలిసి పనిచేస్తామన్నారు. జిల్లా టూరిజం శాఖ అధికారి పి.రాజశేఖర్‌రెడ్డి, టూరిజం ఆర్‌డీ రామచంద్ర మాట్లాడారు. విశ్రాంత ఆర్డీ గుర్రాల గోపాల్‌, స్టెప్‌ సీఈవో ఎం.రామచంద్రారెడ్డి, పుష్పరాజేష్‌, ఇలియాస్‌రెడ్డి, మొగిలిచెండు సురేష్‌, ఎం.రామాంజులరెడ్డి, కొండూరు జనార్ధనరాజు, పసుపులేటి విజయకుమారి, తదితరులు పాల్గొన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని