ఉత్సాహంగా ఆహార్యం జాతీయ కార్యశాల
eenadu telugu news
Published : 27/09/2021 06:17 IST

ఉత్సాహంగా ఆహార్యం జాతీయ కార్యశాల


మేకప్‌ వేసిన యువతతో నిర్వాహకులు

 

యోగి వేమన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే : ఆహార్యం అంశంపై నిర్వహిస్తున్న జాతీయ కార్యశాల ఉత్సాహంగా సాగుతోంది. యోగి వేమన విశ్వవిద్యాలయం లలితకళల విభాగం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆహార్యం(ముఖాంగ రచన-వస్త్రధారణ) జాతీయ కార్యశాల నాలుగో రోజుకు చేరుకుంది. ఆదివారం శిక్షణలో యువతీ, యువకులను వృద్ధులుగా చేయడం ఎలాగో నేర్పారు. కార్యశాల శిక్షణ సమన్వయకర్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం రంగస్థలం విభాగం విశ్రాంత ఆచార్యులు ప్రసాద్‌రెడ్డి పర్యవేక్షణలో శిక్షణ నిపుణులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఆర్‌.హరిశ్చంద్ర, దవలేశ్వరపు పరమేశ్‌ శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో లలితకళల విభాగాధిపతి మూల మల్లికార్జునరెడ్డి, ఆచార్యులు తప్పెట రామప్రసాద్‌రెడ్డి, చదలవాడ వెంకటేశ్‌, ఇరాట సుజాత, అప్పలాచారి, వెంకటేశ్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని