నేటి నుంచి బీసీ శాసనసభ కమిటీ పర్యటన
eenadu telugu news
Published : 27/09/2021 06:17 IST

నేటి నుంచి బీసీ శాసనసభ కమిటీ పర్యటన

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : రాష్ట్ర బీసీ శాసనసభ కమిటీ జిల్లాలో పర్యటించనుందని కలెక్టర్‌ విజయరామరాజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం రాత్రి 8.30 గంటలకు కడప నగరానికి చేరుకుని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో బసచేస్తారన్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు బీసీ కులాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం నగరంలోని బీసీ సంక్షేమ వసతిగృహాలను పరిశీలించి, మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్‌లో జరిగే సమావేశంలో పాల్గొంటారన్నారు. సాయంత్రం రోడ్డుమార్గంలో నెల్లూరు జిల్లాకు బయలుదేరి వెళ్తారని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని