రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
eenadu telugu news
Published : 27/09/2021 06:17 IST

రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక


జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు వీరే...

కడప క్రీడలు, న్యూస్‌టుడే : జిల్లా గ్రాఫ్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి గ్రాఫ్లింగ్‌(కుస్తీ) ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. ఆదివారం కడప నగరంలోని నాగార్జున పాఠశాలలో అండర్‌-15, సబ్‌ జూనియర్స్‌, జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగంలో ఎంపికలు నిర్వహించారు. రాష్ట్రస్థాయి పోటీలకు.. అండర్‌-15 విభాగంలో కె.అజయ్‌, ఎన్‌.విక్రమ్‌, ఎం.లోహిత్‌, ఎం.మహిధర్‌, కె.ధీరజ్‌, కె.సాయిరాం, సబ్‌ జూనియర్స్‌ విభాగంలో ఎస్‌.కమల్‌, డి.కార్తీక్‌, ఎం.వర్ధన్‌, ఎస్‌.సుహేల్‌, ఎస్‌.సాజిద్‌, కె.బాలకృష్ణ, బి.సాత్విక్‌, సి.కీర్తన, జూనియర్స్‌ విభాగంలో కె.జగన్‌మోహన్‌రెడ్డి, కె.సాయిప్రతాప్‌, ఎల్‌.సాయికృప, ఎం.వినయ్‌, పి.శాలిని, కె.శిల్ప, వి.వెంకటకవిత, పి.యశస్విని, సీనియర్స్‌ విభాగంలో కె.మధుసూదన్‌, బి.గణేష్‌నాయక్‌, డి.సురేష్‌, బి.శివసాయినాయక్‌, ఎల్‌.లోకేష్‌, ఎం.వినయ్‌, ఎస్‌.ఫ్రాన్సీస్‌, కె.రవితేజ, కె.సాయిరెడ్డి, ఎమ్‌.రేణుక ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు అక్టోబరు 2, 3వ తేదీల్లో అనంతపురం జిల్లా నార్పల మండలంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని అధ్యక్ష, కార్యదర్శులు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని