రహదారి ప్రమాదంలో నలుగురికి గాయాలు
eenadu telugu news
Published : 20/10/2021 04:42 IST

రహదారి ప్రమాదంలో నలుగురికి గాయాలు


ప్రమాదంలో దెబ్బతిన్న వాహనాలు

బోయనపల్లి (రాజంపేట గ్రామీణ), న్యూస్‌టుడే : రాజంపేట మండలం బోయనపల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. మన్నూరు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... తిరుపతి నుంచి నూనె లోడుతో వెళుతున్న సరకు రవాణా వాహనం, కడప నుంచి రాజంపేటకు వస్తున్న కారు ఢీకొన్నాయి. కమలాపురానికి చెందిన నూనె వాహనం చోదకుడు రఘు, రంగయ్య స్వల్పంగా గాయపడ్డారు. కారులో ప్రయాణిస్తున్న రాజంపేటకు చెందిన పెంచలప్రసాద్‌, లాలన్‌కు సల్ప గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు దెబ్బతిన్న వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని