పట్టాలు తప్పిన గూడ్సు రైలు
eenadu telugu news
Published : 20/10/2021 04:42 IST

పట్టాలు తప్పిన గూడ్సు రైలు

నందలూరు, రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే : దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్‌ పరిధిలోని ముంబయి- చెన్నై ప్రధాన మార్గంలో కడప జిల్లా నందలూరు- హస్తవరం మధ్య మంగళవారం గూడ్సురైలు పట్టాలు తప్పింది. బళ్లారి నుంచి కృష్ణపట్నంకు ఖాళీ బోగీలతో వెళుతున్న ఈ రైలు నందలూరు రైలునిలయం దాటి హస్తవరం సమీపంలోకి వెళ్లగానే ఇంజిన్‌ వెనుకవైపు ఉన్న బోగీ పట్టాలు తప్పడంతో నిలిపి వేశారు. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుంతకల్లు రైల్వే డివిజన్‌ ఏడీఆర్‌ఎం, ఇంజినీరింగ్‌, మెకానికల్‌, విద్యుత్తు, భద్రతా విభాగం అధికారులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పట్టాలు తప్పిన బోగీని తొలగించి పాడైన రైలు మార్గాన్ని తాత్కాలికంగా పునరుద్ధరించారు. ప్రత్యామ్నాయ మార్గంలో రైళ్లను నడిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని