30న బద్వేలునియోజకవర్గమంతటా సెలవు
eenadu telugu news
Published : 20/10/2021 04:42 IST

30న బద్వేలునియోజకవర్గమంతటా సెలవు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: బద్వేలు ఉప ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30వ తేదీన నియోజకవర్గవ్యాప్తంగా సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్‌ విజయరామరాజు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు 30వ తేదీ శనివారం ఆయా పోలింగ్‌ పరిసరాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలు, పరిశ్రమలకు స్థానిక సెలవు ప్రకటించామన్నారు. పబ్లిక్‌, ప్రైవేటు, ఫర్మ్‌ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్థలకు కూడా సెలవు ప్రకటించామన్నారు. వీటితో పాటు పోలింగ్‌కు ముందు రోజు అంటే ఈనెల 29వ తేదీన అన్ని పోలింగ్‌, పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసిన సంస్థలకు స్థానిక సెలవు ప్రకటించామన్నారు. అంతేగాకుండా వచ్చే నెల రెండో తేదీన లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన సంస్థకు సెలవు ప్రకటించామన్నారు. ఈమేరకు సంబంధిత అధికారులు ఆదేశాలు తప్పక అమలయ్యేవిధంగా చూడాలని ఆదేశించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని