మరోసారి ధర్నా చేస్తే బాహాబాహీకి దిగుతాం
eenadu telugu news
Published : 20/10/2021 05:01 IST

మరోసారి ధర్నా చేస్తే బాహాబాహీకి దిగుతాం

తెదేపా కడప పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు లింగారెడ్డి

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు లింగారెడ్డి ఇంటి ముందు వైకాపా నేతలు ధర్నా చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై పట్టాభి వ్యాఖ్యలు చేస్తే తన ఇంటి ముందు ఆందోళన చేయడమేమిటని ప్రశ్నించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే వైకాపా ఇలాంటి ఆరాచకాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. పట్టాభి వ్యాఖ్యలకు ఆయన్ను అరెస్టు చేయాల్సి వస్తే మంత్రి కొడాలి నానిని ఎన్నిసార్లు అరెస్టు చేయాలని ఆయన ప్రశ్నించారు. వైకాపా బెదిరింపులకు భయంతో ఇళ్లలో ఉండే ప్రసక్తే లేదని, తెదేపా నేతల మాటల్లో నిజాయితీ ఉందన్నారు. ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ధర్నాలు చేస్తోందని మండిపడ్డారు. ఇంకోసారి తెదేపా నేతల ఇళ్ల వద్ద ధర్నాలు చేస్తే చూస్తూ ఊరుకోమని... బాహాబాహికి దిగేందుకు సిద్ధమని లింగారెడ్డి హెచ్చరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని