‘భవన నిర్మాణ రరగం కుదేలు’
eenadu telugu news
Published : 20/10/2021 05:01 IST

‘భవన నిర్మాణ రరగం కుదేలు’


కరపత్రాలను ఆవిష్కరిస్తున్న సంఘం నాయకులు

మైదుకూరు, న్యూస్‌టుడే: భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏపీ బిల్డింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిలేటి అన్నారు. కార్మికుల సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేశారని విమర్శించారు. మంగళవారం ఏఐటీయూసీ కార్యాలయంలో ఈ నెల 24వతేదీ నుంచి మూడ్రోజులపాటు మైదుకూరు పట్టణంలో నిర్వహించే జిల్లా స్థాయి శిక్షణ తరగతుల కరపత్రాలను ఆవిష్కరించారు. మద్దిలేటి మాట్లాడుతూ... ఇసుక, సిమెంట్‌, కడ్డీల ధరలు పెరిగిపోతున్నా వాటి నియంత్రణ కరవైందన్నారు. ఇలాంటి ఎన్నో విషయాలపై శిక్షణ తరగతుల సందర్భంగా చర్చించబోతున్నట్లు పేర్కొన్నారు. కరపత్రాల ఆవిష్కరణలో ఏఐటీయూసీ ప్రతినిధులు పి.శ్రీరాములు, ఏవీ శివరాం, భాస్కర్‌, యూనియన్‌ నాయకులు పీరయ్య, షావలి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని