లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
eenadu telugu news
Published : 22/10/2021 04:35 IST

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

పది మందికి తీవ్ర గాయాలు


ప్రమాదంలో నుజ్జునుజ్జయిన ఆర్టీసీ బస్సు

దువ్వూరు, న్యూస్‌టుడే : మండల పరిధిలోని జిల్లెళ్ల గ్రామ సమీపంలో కడప- కర్నూలు జాతీయ రహదారిపై గురువారం ఆర్టీసీ బస్సు లారీని ఢీకొన్న ప్రమాదంలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ నుంచి మైదుకూరు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో బస్సు చోదకుడు నాగయ్య, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు సునీత, పద్మావతి, మాధవకృష్ణారెడ్డి, మనోహర్‌, శంకరమ్మ, మల్లికార్జున, రామసుబ్బమ్మ మరో ఇద్దరు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్సై కె.చపలరాజు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను 108 వాహనాల్లో ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని