క్రికెట్‌ బుకీల అరెస్టు
eenadu telugu news
Published : 22/10/2021 04:35 IST

క్రికెట్‌ బుకీల అరెస్టు

రూ.18,65,289 నగదు ఫ్రీజ్‌

నాలుగు కిలోల గంజాయి స్వాధీనం


వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటశివారెడ్డి, చిత్రంలో నిందితులు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : కడప నగరంలోని ఓ లాడ్జిపై చిన్నచౌకు ఠాణా పోలీసులు దాడులు చేసి క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఎనిమిది మంది క్రికెట్‌ బుకీలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంటశివారెడ్డి తెలిపారు. చిన్నచౌకు ఠాణాలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ‘అంబేడ్కర్‌ కూడలి సమీపంలోని ఓ లాడ్జిలో క్రికెట్‌ బెట్టింగ్‌తో పాటు గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి దాడులు చేశారు. ప్రొద్దుటూరు పట్టణం మట్టిమసీదు వీధికి చెందిన షేక్‌ ఫారూక్‌, షేక్‌ షాజీద్‌, షేక్‌ సలీం జావెద్‌, ఒంగోలు పట్టణం వెంటేశ్వరనగర్‌కు చెందిన అద్దాల కళ్యాణ్‌, సత్యనారాయణపురానికి చెందిన జెట్టిపోయిన వెంకటేశ్వర్లు, పాండిచ్చేరి రాష్ట్రం యానాంకు చెందిన ముద్దునూరు ప్రదీప్‌, మైదుకూరుకు చెందిన సయ్యద్‌ పీర్‌బాషా, కర్నూలు పట్టణం పూలబజార్‌కు చెందిన షేక్‌ మహమ్మద్‌ పర్వేజ్‌ను అరెస్టు చేశారు. వీరిలో షేక్‌ ఫారూక్‌ ప్రధాన బుకీగా, మిగిలిన వారు సబ్‌ బుకీలుగా వ్యవహరించేవారు. వీరి ఖాతాల్లో ఉన్న రూ.18,65,289 నగదును ఫ్రీజ్‌ చేయగా, మూడు కమ్యూనికేటర్లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, నాలుగు కిలోల గంజాయి, ఒక కారు, 115 ప్యాడ్‌చరవాణులు, 10 స్మార్ట్‌ఫోన్లు, రూ.4 వేల నగదు స్వాధీనపరుచుకున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌తో పాటు వీరు విశాఖపట్నానికి వెళ్లి కిలో గంజాయి రూ.5వేలతో కొనుగోలు చేసి చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసి ఒక్కో పొట్లం రూ.1500తో కడప, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో బెట్టింగ్‌ నిర్వహించే వారికి విక్రయించే వారు’ అని డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు. సమావేశంలో చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సైలు రోషన్‌, అమర్‌నాథ్‌రెడ్డి, రాజరాజేశ్వరరెడ్డి, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని