‘హక్కులను హరించడం దుర్మార్గం’
eenadu telugu news
Published : 22/10/2021 04:35 IST

‘హక్కులను హరించడం దుర్మార్గం’


గృహ నిర్బంధంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్‌శర్మ

కమలాపురం, రాయచోటి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మానవ హక్కులను ప్రభుత్వం పోలీసులతో హరించి వేయడం దుర్మార్గపు చర్య అని తెదేపా రాష్ట్ర కార్యదర్శులు సాయినాథ్‌శర్మ, గాజుల ఖాదర్‌బాషా అన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న నిరసన దీక్షకు వెళుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు సాయినాధ్‌శర్మను గృహ నిర్బంధం చేయగా, ఖాదర్‌బాషాను ఆయన నివాసం వద్ద తెల్లవారుజామున 4 గంటలకు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. వీరితోపాటు పలువురు నాయకులను గృహ నిర్బంధం చేశారు. అనంతరం షరతులతో కూడిన 149 నోటీసు ఇచ్చి విడుదల చేశారు.


పోలీసు ఠాణాలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని