‘రాజకీయంగా ఎదుర్కొనలేకే అనుచిత వ్యాఖ్యలు’
eenadu telugu news
Published : 22/10/2021 04:35 IST

‘రాజకీయంగా ఎదుర్కొనలేకే అనుచిత వ్యాఖ్యలు’

జనాగ్రహ దీక్షపేరిట వైకాపా నిరసన కార్యక్రమాలు


రైల్వేకోడూరులో పాల్గొన్న ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, నాయకులు

కడప నగరపాలక, రైల్వేకోడూరు, పులివెందుల, రాయచోటి, న్యూస్‌టుడే : తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభిరామ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జిల్లావ్యాప్తంగా గురువారం వైకాపా నాయకులు జనాగ్రహ దీక్ష పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కడప నగరంలోని అంబేడ్కర్‌ కూడలిలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లికార్జునరెడ్డి సందర్శించి మాట్లాడారు. ముఖ్యమంత్రిని రాజకీయంగా ఎదుర్కొనలేకే తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పట్టాభిరామ్‌తో అనుచిత వ్యాఖ్యలు చేయించారని ఆరోపించారు. తొలిరోజు దీక్షలో పాల్గొన్నవారికి నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్మన్‌ పులి సునీల్‌కుమార్‌ ప్రారంభించిన శిబిరంలో కడప నగరపాలక సంస్థ ఉప మేయరు బండి నిత్యానందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్‌, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ యానాదయ్య, కార్పొరేటర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు వైకాపా నాయకులు పాల్గొన్నారు. n ముఖ్యమంత్రిపై తెదేపా నాయకుడు పట్టాభిరామ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయనతోపాటు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు డిమాండు చేశారు. రైల్వేకోడూరులోని గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన జనాగ్రహ దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైకాపా కార్యకర్తలు పసుపు చొక్కాలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. n ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో తిడితే సహించే ప్రసక్తే లేదని పులివెందుల పురపాలక సంఘం ఛైర్మన్‌ వరప్రసాద్‌ హెచ్చరించారు. పులివెందులలో ఏర్పాటుచేసిన జనాగ్రహ దీక్షలో మాట్లాడారు. n ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెదేపా నేతలు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ జకియాఖానం డిమాండు చేశారు. రాయచోటిలో ఏర్పాటుచేసిన జనాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. తెదేపా నీచ రాజకీయాలకు పాల్పడుతోందని పురపాలక సంఘం ఛైర్మన్‌ ఫయాజ్‌బాషా విమర్శించారు.

కడప : జనాగ్రహ దీక్షలో పాల్గొన్న వైకాపా నాయకులు
 


రాయచోటిలో ఎమ్మెల్సీ జకియాఖానం, నాయకులు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని