సీనియారిటీకి రక్షణ కల్పించాలని వినతి
eenadu telugu news
Published : 22/10/2021 04:35 IST

సీనియారిటీకి రక్షణ కల్పించాలని వినతి


కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

కడప విద్య, న్యూస్‌టుడే : విద్యాశాఖ విడుదల చేసిన ఉద్యోగోన్నతుల షెడ్యూలు తేదీల్లోనే పుర, నగరపాలక ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు పూర్తిచేసి సీనియారిటీకి రక్షణ కల్పించాలని పురపాలకశాఖ కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌ను కోరినట్లు ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తెలిపారు. గుంటూరులోని కమిషనర్‌ కార్యాలయంలో ఎస్టీయూ నాయకులతో కలిసి పురపాలక ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై గురువారం చర్చించినట్లు చెప్పారు. అన్నికేడర్ల ఉద్యోగోన్నతులపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని, బదిలీలపై ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని