ఆసరా జేసీగా ధ్యాన్‌చంద్రకు అదనపు బాధ్యతలు
eenadu telugu news
Published : 22/10/2021 04:35 IST

ఆసరా జేసీగా ధ్యాన్‌చంద్రకు అదనపు బాధ్యతలు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఆసరా సంయుక్త కలెక్టర్‌గా గృహనిర్మాణ సంయుక్త కలెక్టర్‌ ధ్యాన్‌చంద్రకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సంక్షేమం, ఆసరా సంయుక్త కలెక్టర్‌గా ఉన్న ధర్మచంద్రారెడ్డి కడప ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టగా తాత్కాలిక జేసీగా ఇప్పటివరకు బాధ్యతల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ విజయరామరాజు ఆదేశాల మేరకు జేసీ బాధ్యతలను తప్పించి కడప ఆర్డీవోగా పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఆయన స్థానంలో గృహనిర్మాణ సంయుక్త కలెక్టర్‌ ధ్యాన్‌చంద్రకు అదనపు బాధ్యతలు అప్పగించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని