‘మేం తలుచుకుంటే చంద్రబాబు తాత కూడా అడ్డుకోలేరు’
eenadu telugu news
Published : 22/10/2021 04:35 IST

‘మేం తలుచుకుంటే చంద్రబాబు తాత కూడా అడ్డుకోలేరు’


మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

రాజంపేట గ్రామీణ, కడప సంక్షేమం, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కానీ, మా పార్టీ నాయకులు కానీ తలుచుకుంటే చంద్రబాబు కాదు కదా ఆయన తాత వచ్చినా అడ్డుకోలేరని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. రాజంపేట మండలం బోయనపల్లిలోని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి గృహంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా జరుగుతున్నా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయించడం దారుణమన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి మార్చుకోవాలని సూచించారు. ఆయనవెంట నందలూరు ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ గుల్జార్‌బాషా, జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు యోగీశ్వర్‌రెడ్డి, వైకాపా నాయకులు తదితరులున్నారు. H ఉనికిని చాటుకోవడానికి తెదేపా నాయకులు అలజడులు సృష్టిస్తున్నారని ఎమ్మెల్సీ, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య ఆరోపించారు. గురువారం వైకాపా జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమి, మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీని కాపాడుకోవడానికి నీచ రాజకీయాలకు తెరతీశారన్నారు. జనసేన నాయకుడు పవన్‌కల్యాణ్‌ ఉదయం ఒకమాట, రాత్రి ఒకమాట మాట్లాడతారని ఎద్దేవా చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని