కలసపాడులో భాజపా రోడ్‌షో
eenadu telugu news
Updated : 22/10/2021 16:43 IST

కలసపాడులో భాజపా రోడ్‌షో

కలసపాడు: మండల కేంద్రంలో భాజపా శ్రేణులు శుక్రవారం రోడ్‌ షో కార్యక్రమం నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌, భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి పనతల సురేశ్‌, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నిషితారాజు తదితరులు స్థానిక పోరుమామిళ్ల రహదారి నుంచి రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. సురేశ్‌కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మండల ఇన్‌ఛార్జి నీలకంఠం, మండల పార్టీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని