పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివి
eenadu telugu news
Updated : 22/10/2021 16:43 IST

పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివి

కలసపాడు: పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివని ఏపీఎస్పీ 11వ బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌(డీఎస్పీ) కందుల వెంకట్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం కలసపాడులోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో తీవ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పామూరు సుబ్బారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరవీరుల సేవలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఎస్సై రామాంజినేయులు, ప్రధానోపాధ్యాయుడు రమణారెడ్డి, ఉపాధ్యాయులు, పోలీసులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని