Badvel By Election: అధికారంలోకి వచ్చాక జగన్‌ ఇంటి నుంచి కదలట్లేదు: సోము
eenadu telugu news
Published : 23/10/2021 13:07 IST

Badvel By Election: అధికారంలోకి వచ్చాక జగన్‌ ఇంటి నుంచి కదలట్లేదు: సోము

బద్వేలు: ఏపీలో ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇంటి నుంచి బయటకు రావట్లేదని ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. కడప జిల్లా బద్వేల్‌లో ఉప ఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్న ఆయన.. వైకాపా నేతలు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. బద్వేలులో భూకబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు. వైకాపా నేతలు సామాన్యుల స్థలాలనూ వదలట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాకు గురైన బాధితులు నిన్న ఆత్మహత్యాయత్నం చేశారని వాపోయారు. పల్లెల్లో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని సోము వీర్రాజుమండిపడ్డారు. ఆయన ఆధ్వర్యంలో బద్వేలు త్యాగరాజుకాలనీలో వైకాపాకు చెందిన 150 మంది కార్యకర్తలు భాజపాలో చేరారు. మరోవైపు బద్వేలు ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర సమాచార సహాయ మంత్రి మురుగన్‌, సోము వీర్రాజుతో కలిసి రోడ్‌ షో నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ నేతలు జీవీఎల్‌, కన్నా లక్ష్మీనారాయణ, సి.ఎం.రమేశ్‌ పాల్గొన్నారు.

మంత్రి పెద్దిరెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు..

మంత్రి పెద్దిరెడ్డిపై ఎన్నికల సంఘానికి సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. వైకాపా నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. వైకాపాకే ఓటు వేయాలని ఉద్యోగులపై మంత్రి ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదులో వివరించారు. వైకాపా నేతలపై పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని తెలిపారు. ఈ మేరకు సీఈవో, ఆర్‌వోకు సోము వీర్రాజు వినతిపత్రం అందజేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని