close

సోమవారం, మార్చి 30, 2020

తాజా వార్తలు

‘స్థానికులకే మేయర్‌ పదవి ఇవ్వాలి’

గోదావరిఖని, న్యూస్‌టుడే: రామగుండం నగరపాలక మేయర్‌గా స్థానికులకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. స్థానికేతరులకు మేయర్‌ పీఠాన్ని కట్టబెట్టేందుకు అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలన్నారు. ఉద్యమ పార్టీగా గుర్తించిన తెరాస స్థానికేతరులకు ఏ విధంగా మేయర్‌ పదవిని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందని ప్రశ్నించారు. అధికార పార్టీలోనే స్థానికులు, దళిత నాయకులున్నారని, అవసరమైతే వారికి అవకాశం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అధికార పార్టీ నాయకులు ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులను గుర్తించి మేయర్‌ పదవిని కేటాయించడంలో తమకు అభ్యంతరం లేదని, స్థానికేతరులకు అవకాశం కల్పిస్తే ప్రజల్లోకి వెళ్లి ఈ విషయంపై ప్రచారం చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.