Published : 05/07/2020 05:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పల్లెల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి


మర్తన్‌పేటలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న జడ్పీ అధ్యక్షురాలు అరుణ

వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే: పల్లెల అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని జడ్పీ ఛైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. వేములవాడలో శనివారం వేములవాడ మండలం, గ్రామీణ మండలాల ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులకు హరితహారం, ఉపాధి హామీపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పల్లెలో ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఉపాధి హామీలో పంట కళ్లాలు నిర్మించుకునే విధంగా ప్రజా ప్రతినిధులు రైతులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై పంచాయతీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, ఏపీడీ నర్సింహులు, జడ్పీటీసీ సభ్యులు మ్యాకల రవి, ఏస వాణి, ఎంపీపీలు బూర వజ్రవ్వ, బండ మల్లేశం యాదవ్‌, ఎంపీడీవోలు నరేశ్‌ ఆనంద్‌, రాంరెడ్డి, ఏపీవో ఆనంద్‌, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

కోనరావుపేట : స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. కోనరావుపేట మండలం మర్తన్‌పేటలో శనివారం తడి, పొడి చెత్త సేకరణపై స్థానిక ప్రజాప్రతినిధులు, సీఏలు, మహిళా సంఘాలకు అవగాహన కల్పించారు. జిల్లాలోనే మర్తన్‌పేట సర్పంచి వంశీకృష్ణారావు కంపోస్టు షెడ్‌ పూర్తి చేయటం అభినందనీయమన్నారు. తడి, పొడి చెత్త వేరు చేయటంతో మహిళలు సేంద్రియ ఎరువులు తయారు చేయవచ్చని సూచించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, డీఎల్‌పీవో మల్లికార్జున్‌, మండల ప్రత్యేకాధికారి కొండల్‌రావు, స్వచ్ఛభారత్‌ జిల్లా సమన్వయకర్త సురేశ్‌, సింగిల్విండో అధ్యక్షులు రామ్మోహన్‌రావు, నర్సయ్య యాదవ్‌, ఎంపీడీవో రామకృష్ణ, ఏపీవో చంద్రయ్య, జేఈ శ్రీహరి, తెరాస మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని