close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సమస్యలపై సభ్యుల నిరసన

మేడిపల్లి మండల సర్వసభ్య సమావేశం

సమావేశంలో నివేదిక చదువుతున్న అధికారి

మేడిపల్లి, న్యూస్‌టుడే: మేడిపల్లి మండలంలోని పలు సమస్యలపై సభ్యులు నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని, గ్రామ పంచాయతీ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం నివారించాలని డిమాండ్‌ చేశారు. మేడిపల్లి మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ దొనకంటి ఉమాదేవి అధ్యక్షతన మంగళవారం జరిగింది. మండలంలోని రాగోజిపేట, ఒడ్డాడు గ్రామాలను వెంకట్రావుపేట క్లస్టర్‌లో కలపాలని సర్పంచి కాటిపల్లి జగన్‌ రెడ్డి కోరారు. వైద్య ఆరోగ్యశాఖపై సర్పంచులు తిరుపతి రెడ్డి, సంపత్‌కుమార్‌, కరండ్ల మధుకర్‌ మాట్లాడుతూ ప్రస్తుత కరోనా సమయంలో అధికారులు పట్టించుకోవడం లేదని నిరసన తెలిపారు. కనీసం ఫోన్లు కూడా రిసీవ్‌ చేసుకోవడం లేదంటూ పేర్కొనగా ఇకనుంచి స్పందిస్తామని వైద్యాధికారి శివకుమారి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ వ్యవహారాల్లో మండల పరిషత్తు కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌ జోక్యం ఎందుకు చేసుకుంటున్నారని సర్పంచి ద్యావనపల్లి అభిలాష్‌ ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఎంపీడీఓ పద్మజ ఆదేశించారు. ఈ విషయమై వాడి వేడి చర్చ జరిగింది. సర్పంచులు నరేశ్‌ రెడ్డి, మధు, తిరుపతి రెడ్డి, జగన్‌ తదితరులు సర్పంచులకు తరచూ నోటీసులు ఎందుకు పంపుతున్నారంటూ ప్రశ్నించారు. నీటి పారుదల శాఖపై సర్పంచులు దుంపేట లక్ష్మీనర్సయ్య, కరండ్ల మధుకర్‌, జగన్‌ రెడ్డి తదితరులు మాట్లాడుతూ మిషన్‌ భగీరథ కింద నీళ్లు రాకున్నా నీళ్లు వస్తున్నాయంటూ అధికారులు నివేదికలు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారుజ వీరి నివేదికల ఆధారంగా ఉన్నతాధికారులు గ్రామాల్లోని బోర్లకు విద్యుత్తు కనెక్షన్లు తొలగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త రేషన్‌కార్డులు రావడం లేదంటూ మేడిపల్లి ఎంపీటీసీ సభ్యురాలు వినోద, రైతు వేదికల నిర్మాణాలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం లేదంటూ గోవిందారం ఎంపీటీసీ సభ్యురాలు పూర్ణిమ సభ దృష్టికి తెచ్చారు. సమావేశంలో ఎంపీడీఓ పద్మజ తహసీల్దార్‌ రాజేశ్వర్‌, ఏఓ త్రివేదిక తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.