close

గురువారం, అక్టోబర్ 01, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అందరూ దూరమై.. అనాథలై

అనాథలైన చిన్నారులు గుర్రం నవీత, నవీన్‌

రామడుగు: నాలుగేళ్ల క్రితం కన్నవాళ్లు చనిపోగా అన్ని తానై చూసుకున్న నానమ్మ మృతిచెందగా ఆ చిన్నారులు అనాథలయ్యారు. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన గుర్రపు పర్శరాములు, కవిత దంపతులకు నవీత, నవీన్‌ ఇద్దరు సంతానం. ఈ దంపతులు నాలుగేళ్ల కిందట చనిపోవడంతో చిన్నారుల ఆలన పాలన నానమ్మ సత్తెమ్మ తీసుకుంది. అనారోగ్య కారణాలతో సత్తెమ్మ చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారు. ఇల్లు శిథిలావస్థకు చేరిందని, పిల్లల పోషణ ఏ విధంగా సాగుతుందోనని, ఆ పిల్లలకు సహాయం చేయాలని ఎంపీటీసీ సభ్యురాలు గుర్రం దేవిక కోరారు.

ఎమ్మెల్యే ఆర్థిక సాయం

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అనాథ చిన్నారులైన గుర్రం నవీత, నవీన్‌లకు రూ.25 వేల సహాయాన్ని మంగళవారం ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయనే ఆ మొత్తాన్ని పిల్లలకు అందజేస్తారని ఎంపీటీసీ సభ్యురాలు తెలిపారు. గుమ్లాపూర్‌ గ్రామ సర్వాయి పాపన్నగౌడ్‌ యువజన సంఘం రూ.12 వేల నగదు మంగళవారం అందజేసినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.