close

గురువారం, అక్టోబర్ 22, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కమలం.. కసరత్తు

కొత్తపంథాలో నగర కమిటీలు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో వ్యవస్థాగతంగా బలోపేతానికి కొత్తపంథాలో పార్టీ కమిటీల ఏర్పాటుపై భాజపా అధిష్ఠానం దృష్టిపెట్టింది. గతంలో మాదిరిగా నగర కమిటీ స్థానంలో కొత్తగా మండలాల ఏర్పాటు ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగా కరీంనగర్‌ నగరపాలక సంస్థలోని 60 డివిజన్లలో మొత్తంగా ఐదు మండలాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి 12 డివిజన్లకు ఒక మండలంగా ఏర్పాటు చేసి అక్కడ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతోపాటు పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే యోచనలో పార్టీ ముఖ్యలున్నారు. ప్రధానంగా కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ బండి సంజయ్‌ పార్టీ రాష్ట్రఅధ్యక్ష హోదాలో ఉండటంతో నగరంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ 13 మంది కార్పొరేటర్లు ఈ పార్టీ తరఫున గెలవడం, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ కమల పతాక వీచిక కనపడేలా ఓట్లు పెరగడంతో భాజపా శ్రేణులు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇక ఏయే డివిజన్లను మండలాలుగా రూపొందించాలనే విషయమై పార్టీలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆయా మండలాలకు దేశభక్తి కలిగిన ప్రముఖ నాయకుల పేర్లను పెట్టేలా పార్టీ ఆలోచిస్తోంది. ఆయా పదవుల్లోనూ అన్ని వర్గాల వారికి అవకాశం కల్పించాలని కమలనాథులు చూస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఈ ఐదు మండలాల కమిటీలను పర్యవేక్షించేందుకు నగర స్థాయిలో కోర్‌కమిటీని ఐదుగురు ముఖ్యనేతలతోనూ ఏర్పాటు చేయాలని పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.