
TS: వ్యవసాయ బావిలో పడిన చిరుత
మల్కాపూర్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ చిరుత వ్యవసాయ బావిలో పడింది. జిల్లాలోని బోయినపల్లి మండలం మల్కాపూర్‌లో బావిలో పడిన చిరుతను గ్రామస్థులు గమనించి పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది చిరుతను బావి నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలోనూ ఈ ప్రాంతంలో చిరుత సంచరించినట్లు ప్రచారం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బావిలోకి దిగేందుకు మెట్లు లేకపోవడంతో వల వేసి తీయాలా లేదా మత్తు మందు ఇచ్చి చిరుతను బయటకు తీయాలా అనే విషయాన్ని అధికారులు తేల్చుకోలేకపోతున్నారు. హైదరాబాద్ నుంచి రెస్క్యూ టీమ్‌ను రప్పించేందుకు సమాచారం ఇచ్చినట్లు వేములవాడ సెక్షన్ అధికారి సౌమ్య తెలిపారు.
ఇవీ చదవండి..
టీకాలపై ఆప్షన్ లేదు..!
పోలీసులపై కేసు నమోదు చేయాలి: బండి సంజయ్
Tags :