Updated : 21/04/2021 02:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైలు కింద పడి యువకుడి బలవన్మరణం

అవేజ్‌

పెద్దపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: రాఘవపూర్‌ గ్రామానికి చెందిన మహమ్మద్‌ అవేజ్‌(25) సోమవారం రాత్రి గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల రైల్వే పోలీస్‌ అధికారి సంపత్‌ కథనం ప్రకారం రాత్రి 9 గంటల సమయంలో ఫోన్‌ వస్తుందని తల్లికి చెప్పి అవేజ్‌ బయటకు వెళ్లాడు. పెద్దపల్లి-రాఘవపూర్‌ రైల్వే స్టేషన్ల మధ్య ఎల్‌సీ గేట్‌ నెంబర్‌ 42 పక్కన ద్విచక్రవాహనాన్ని ఆపి, గూడ్స్‌ రైలు కింద పడి మృతి చెందాడు. అవేజ్‌ ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీస్‌ అధికారి తెలిపారు.


అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య

పారుపల్లి(ముత్తారం): పారుపల్లికి చెందిన దాసరి కబీర్‌దాస్‌(45) అనారోగ్యంతో బాధ పడుతూ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీవితంపై విరక్తి చెందిన అతడు బ్లేడుతో మోచేయి వద్ద కోసుకోగా అధిక రక్తస్రావంతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. అవివాహితుడైన కబీర్‌దాస్‌ ఉదయం నుంచి ఇంటి బయటకు రాకపోవడంతో ఇరుగురుపొరుగు వారు చూసేసరికే మృతి చెంది ఉన్నాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని