Published : 21/04/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధర్మపురిలో రూ.8.50 కోట్లతో 50 పడకల ఆసుపత్రి

ధర్మపురి, న్యూస్‌టుడే: ధర్మపురిలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ప్రభుత్వం రూ.8.50 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో ఈ నిధులు కేటాయించిందని తెలిపారు. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు మంగళవారం జీవో నెం.324 ద్వారా పరిపాలనాపరమైన అనుమతులిచ్చినట్లు వెల్లడించారు. 50 పడకల మాతాశిశు సంక్షేమ శాఖ ఆసుపత్రి నిర్మాణానికి మొత్తం రూ.18.55 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదించగా, మొదటి విడతలో రూ.8.50 కోట్లు విడుదల చేసిందన్నారు. పట్టణంలో నిర్మించే ఈ 50 పడకల ఆసుపత్రిలో నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలందుతాయని మంత్రి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని