Published : 21/04/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జిల్లాలో భానుడి భగభగ

జగిత్యాలలోని పాతబస్టాండు వద్ద మంగళవారం తగ్గిన జనసంచారం

జగిత్యాల ధరూర్‌క్యాంపు: జిల్లాలో వరుసగా రెండోరోజూ ఎండతీవ్రత అధికంగానే కొనసాగింది. మంగళవారం అత్యధికంగా కోరుట్లలో 42.5 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వెల్గటూరు మండలం ఎండపల్లిలో 42.3, మద్దుట్ల, అల్లీపూర్‌లలో 41.7, రాఘవపేట, కథలాపూర్‌ 41.5, సారంగాపూర్‌, మల్లాపూర్‌ 41.3, పెగడపల్లి 41.0, పొలాస, రాయికల్‌ 40.9, మేడిపల్లి, మన్నెగూడెం 40.7, జగ్గాసాగర్‌ 40.5, ఐలాపూర్‌లో 40.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం 27.7 డిగ్రీల సెల్సియస్‌కు పెరగగా రానున్న ఐదు రోజుల్లోనూ రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల సెల్సియస్‌కు చేరతాయని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్‌కు పైబడి నమోదవుతాయని పొలాస పరిశోధనస్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ పి.జగన్మోహన్‌రావు తెలిపారు. ఎండలతీవ్రత పెరుగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని