Published : 21/04/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గ్రామాల అభివృద్ధే లక్ష్యం

భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌

నర్సింగాపూర్‌(జగిత్యాల గ్రామీణం): గ్రామాల అభివృద్ధే తెరాస ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాల గ్రామీణ మండలం నర్సింగాపూర్‌లో రూ.25 లక్షలతో నిర్మించే సీసీ రోడ్ల పనులకు జగిత్యాల జిల్లా పరిషత్తు అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో మిషన్‌ భగీరథ పనులు, నీటి సరఫరాపై పరిశీలించారు. నర్సింగాపూర్‌ శివారులో ఉన్న రెండు పడక గదుల ఇళ్లలో తాగునీటికి ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఆయన ధరూర్‌ నుంచి తాగునీరు అందించేలా చూడాలన్నారు. ఎంపీపీ గాజర్ల గంగారాంగౌడ్‌, నర్సింగాపూర్‌, వంజరపల్లి సర్పంచులు సరోజన, రజిత తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని