Published : 21/04/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కర్ఫ్యూ షురూ

చర్యలు చేపట్టిన పోలీసులు

జనసంచారం లేకుండా ఉన్న తెలంగాణచౌక్‌-బస్టాండ్‌ మార్గం

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: కరోనా కేసుల ఉద్ధృతి పెరగడంతో రాష్ట్రం ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ మంగళవారం రాత్రి 9:00 గంటల నుంచి ప్రారంభమైంది. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. మధ్యాహ్నం నుంచి సామాజిక మాధ్యమాల్లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు సమాచారం రావడంతో ముందుస్తు చర్యగా 8 గంటల వరకు కమిషనరేట్‌ వ్యాప్తంగా వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. ప్రజలు సైతం రోడ్డుపైకి రాలేకపోయారు. ప్రతి కూడలిలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి వాహనదారుల సమాచారం సేకరించిన పంపించారు. జనసంచారంతో ఎప్పుడూ రద్దీగా ఉండే కరీంనగర్‌లోని టవర్‌సర్కిల్‌, తెలంగాణచౌక్‌, కమాన్‌, కోర్టు, బస్టాండ్‌ చౌరస్తాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. అత్యవసర సమయంలో తప్ప ఎవరూ రాత్రి సమయంలో బయటకు రావొద్దని సీపీ సూచించారు. ఇష్టానుసారంగా రోడ్డుపై తిరిగే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.

తెలంగాణ చౌక్‌లో సీపీ కమలాసన్‌రెడ్డి పరిశీలన

జమ్మికుంట : కరోనా నియంత్రణలో భాగంగా మంగళవారం రాత్రి పోలీసులు జమ్మికుంటలో దుకాణాలను మూసివేయించారు. స్థానిక సీఐ రమేశ్‌ పర్యవేక్షణలో పోలీసులు కర్ఫ్యూ నేపథ్యంలో దుకాణాల యజమానులు సహకరించాలని మైక్‌ ద్వారా సూచనలు చేశారు. పోలీసుల సూచనలతో దుకాణాలు మూతపడగా, చిరు వ్యాపారులను బంద్‌ చేయించగా, రాత్రి 8 గంటల నుంచే స్థానిక గాంధీచౌక్‌ కూడలి, హుజూరాబాద్‌ రోడ్డు, ఆర్వోబీ ప్రాంతం, స్థానిక కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి.. రాత్రి 9 గంటల నుంచి కర్ఫ్యూ ప్రకటించినా జమ్మికుంటలో నిర్ణీత సమయానికి కంటే ముందే అమలు కనిపించింది.

మత్స్యగిరీంద్రస్వామి ఆలయంలో దర్శనాల నిలిపివేత

శంకరపట్నం, న్యూస్‌టుడే: శంకరపట్నం మండలం కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయంపై కరోనా ప్రభావం పడింది. దేవాలయంలో పని చేసే సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ రావడంతో ప్రత్యేక పూజలు, భక్తులకు దర్శనాలు ఈ నెల 30వరకు నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకన్న పేర్కొన్నారు.

జమ్మికుంట గాంధీచౌక్‌ కూడలి..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని