Published : 09/05/2021 16:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలీసు విచారణకు పుట్ట మధు సతీమణి

పిలిచిన రామగుండం పోలీసులు

రామగుండం: హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు సతీమణి శైలజను పోలీసులు విచారణకు పిలిచారు. ఆమెతో పాటు కమాన్‌పూర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ సత్యనారాయణ, వామన్‌రావు తండ్రి కిషన్‌రావును విచారణకు హాజరుకావాలని కోరారు. 

గత నెల 30న పుట్ట మధు అదృశ్యమయ్యారు.  ఈ క్రమంలో ఆయన్ను రామగుండం కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి మధును ఏపీలో భీమవరంలో పట్టుకున్నట్లు రామగుండం కమిషనరేట్‌ ప్రకటించింది. వామన్‌రావు దంపతుల హత్య కేసులో వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా పుట్ట మధు సతీమణి సహా మరికొందరికి పోలీసులు ప్రశ్నించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని