ఎక్కడ ఎన్నికలొస్తే అక్కడ కేసీఆర్‌ వరాలు: ఈటల
eenadu telugu news
Updated : 09/06/2021 14:09 IST

ఎక్కడ ఎన్నికలొస్తే అక్కడ కేసీఆర్‌ వరాలు: ఈటల

ఇల్లందకుంట: అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసమే పనిచేశానని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. పింఛన్లు రాకపోవడంతో వితంతువులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం ఇల్లందకుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు.  పింఛన్లు, రేషన్‌కార్డులు వెంటనే మంజూరు చేయాలని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

పీవీ జిల్లా కోసం తాను గతంలోనే ప్రతిపాదన తెచ్చానన్నారు. ఎన్నికలు ఎక్కడ వస్తే అక్కడ వరాలు ఇచ్చే అలవాటు సీఎం కేసీఆర్‌కు ఉందని వ్యాఖ్యానించారు. తన రాజీనామా తర్వాత గతంలో ఆగిపోయిన పథకాలన్నీ వస్తాయని ప్రజలు సంతోష పడుతున్నారని చెప్పారు. హుజూరాబాద్‌ను జిల్లాగా ప్రకటించడంతో పాటు వావిలాల, చల్లూరును మండలాలుగా ప్రకటించాలని ఈటల డిమాండ్‌ చేశారు. తాను పార్టీ మారలేదని.. బలవంతంగా వెళ్లిపోయేలా చేశారన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని