ఇందుర్తిలో డీపీవో పర్యటన
eenadu telugu news
Published : 29/07/2021 04:06 IST

ఇందుర్తిలో డీపీవో పర్యటన

ఓదెల, న్యూస్‌టుడే: ఓదెల మండలం ఇందుర్తి, భాయమ్మపల్లె గ్రామాల ప్రజలకు, స్థానికుడైన సిద్దిపేట కలెక్టర్‌ పి.వెంకటరాంరెడ్డి రెండు పడకగదుల ఇళ్లు, మినీ వేడుక మందిరం, కంటి ఆసుపత్రి నిర్మించి ఇవ్వడానికి ఇటీవల ప్రణాళికలు తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి గ్రామంలో పర్యటించారు. ప్రధాన రహదారికి ఆనుకుని ఏడెకరాల స్థలంలో వీటిని నిర్మించనున్నట్లు తెలిసింది. ఇందుకు స్థలాలు విక్రయించేందుకు రైతులు ముందుకు రావాల్సి ఉంది. రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజుయాదవ్‌, సర్పంచులు కొంరయ్య, సంధ్యారాణి, ఎంపీడీవో జి.సత్తయ్య తదితరులున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని