కుందనపల్లి వద్ద రైల్వే పైవంతెన మంజూరు
eenadu telugu news
Published : 29/07/2021 04:23 IST

కుందనపల్లి వద్ద రైల్వే పైవంతెన మంజూరు


సికింద్రాబాద్‌లో రైల్వే సీనియర్‌ డీఈఎన్‌(వంతెనలు) సంజీవయ్యకు వినతిపత్రం అందజేస్తున్న డీఆర్‌యుసీసీ సభ్యుడు వెంకటరమణ

అంతర్గాం, న్యూస్‌టుడే: కుందనపల్లి రైల్వేగేటు వద్ద రైల్వే పైవంతెన నిర్మాణానికి ద.మ.రై. మంజూరు తెలిపినట్లు సికింద్రాబాద్‌ డివిజనల్‌ రైల్వే యూజర్స్‌ కన్సల్టేటివ్‌ కమిటీ(డీఆర్‌యుసీసీ) సభ్యుడు క్యాతం వెంకటరమణ తెలిపారు. గ్రాండ్‌ట్రంక్‌ మార్గంతోపాటు బొగ్గు, ఇంధనాల రవాణా మార్గాలకు సంబంధించి 3 రైల్వేగేట్లు ఒకేచోట ఉండటం, సమీప రాజీవ్‌ రహదారికి వెళ్లేందుకు పట్టణ ప్రజలు గేట్ల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇక్కడ పైవంతెన తప్పనిసరిగా నిర్మించాలని కోరుతూ రైల్వే జీఎంకు పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. దీంతో డీఆర్‌ఏం అభయ్‌కుమార్‌గుప్తా పైవంతెన మంజూరు చేస్తూ వర్క్‌ టెండరు ప్రక్రియను ప్రారంభించాలని సీనియర్‌ డీఈఏన్‌(వంతెనలు) సంజీవయ్యకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ విషయమై బుధవారం సీనియర్‌ డీఈఏన్‌ను సికింద్రాబాద్‌ కార్యాలయంలో కలిసి పనులు త్వరగా ప్రారంభించాలని వినతిపత్రం ద్వారా కోరినట్లు తెలిపారు. పైవంతెన డ్రాయింగ్‌కు సంబంధించి రైల్వే జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్టుమెంటు వారు నివేదిక ఇచ్చారని, అక్కౌంట్స్‌ విభాగం వారు పని అంచనా నివేదిక ఇవ్వాల్సి ఉందని అన్నీ వచ్చాక వెంటనే టెండరు పిలుస్తామని చెప్పినట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని